- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్ ఐ ఆర్ లో భాగస్వాములు కావాలి
స్పెషల్ ఇంటిన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్ ) కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.

దిశ, సిద్దిపేట అర్బన్ : స్పెషల్ ఇంటిన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్ ) కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పార్టీ నాయకులతో హరీష్ రావు సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎస్ ఐ ఆర్ లో సిద్దిపేట నియోజక వర్గం ఆదర్శంగా నిలువాలన్నారు. బూత్ లెవల్ ఏజెంట్స్ క్రియాశీలంగా పని చేయాలని చెప్పారు. ఎన్యూమరేషన్ ఫామ్ నింపే ప్రక్రియ లో ప్రజలకు అందుబాటులో ఉండి సహకరించాలని నాయకులకు సూచించారు. 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా అవగాహన కలిపించాలన్నారు. అక్టోబర్ 1 తేదీ వరకు ఫైనల్ ఓటర్ జాబితా వస్తుందని అప్పటి లోగా డబుల్ ఓట్లు లేకుండా, మార్పులు చేర్పులు చేసే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమం పై క్యాంప్ కార్యాలయం లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సుడా మాజీ చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, జాప శ్రీకాంత్ రెడ్డి, వర్మ తదితరులు పాల్గొన్నారు.
మండలానికి 76 వేల మొక్క లేనా..?
హరిత హారం లో బీ ఆర్ ఎస్ ప్రభుత్వం లో గ్రామానికి లక్ష మొక్కలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం లో 76 వేల మొక్కలు మొత్తం మండలానికి ఇవ్వడం పట్ల ఆశ్చర్యం కలిగిస్తుంది ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హౌసింగ్ అధికారులతో, ఎంపీడీఓ, పంచాయతీ రాజ్ శాఖ పనుల పై అధికారులతో ఎమ్మెల్యే హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. మంజూరు కానీ ఇల్లు వెంటనే మంజూరు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న పనులు వేగవంతం గా పూర్తి చేసి, పెండింగ్ బిల్స్ వెంటనే చెల్లించాలన్నారు. గ్రామాల్లో డంప్ యార్డ్స్, వైకుంఠ దామలు, పల్లె ప్రకృతి వనాలు నిర్వహణ లోపించకుండా చూడాలన్నారు. గ్రామాల్లో చెత్త ట్రాక్టర్ ప్రతి రోజు చెత్త సేకరణ చేపట్టాలన్నారు. అన్ని కెనాల్స్ లో మట్టి, పిచ్చి మొక్కలు తొలగించాలన్నారు. నెలాఖరు లో ఎన్ ఆర్ ఈ జి ఎస్ సంబంధించిన సీసీ రోడ్లు పూర్తి చేయాలన్నారు.






