- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ ఔషధాలకు చెక్.. కేంద్రం కొత్త క్యూఆర్ కోడ్ రూల్స్
నకిలీ మందుల అరికట్టేందుకు వ్యాక్సిన్లు, క్యాన్సర్ డ్రగ్స్, యాంటీబయాటిక్స్‌పై క్యూఆర్ కోడ్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ఆహార పదార్థాల నుంచి ఔషధాల వరకు అన్నింటిని కలుషితం చేస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడుతున్న కొంత మంది వ్యాపారులు చేస్తున్న అక్రమాలకు అమాయక ప్రజలు బలి కావాల్సి వస్తోంది. ముఖ్యంగా ప్రాణాలు కాపాడాల్సిన ఔషధాలుృ స్థానంలో నకిలీ ఔషధాలు మార్కెట్లోకి వస్తుండటం కలకలం రేపుతోంది. ఏ మాత్రం గుర్తించని విధంగా ఒరిజినల్ ఔషధాలకు ఫేక్ ఔషధాలను క్రియేట్ చేసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. దీంతో ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వ్యాక్సిన్లు, క్యాన్సర్ మందులపై క్యూఆర్ కోడ్ (QR Code) తప్పనిసరి చేసింది.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వివరాలు:
భారతదేశ ఔషధ సరఫరా వ్యవస్థలో భద్రత, నాణ్యత మరియు పారదర్శకతను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో నకిలీ మందుల చలామణీని అరికట్టేందుకు గాను.. వ్యాక్సిన్లు, యాంటీమైక్రోబియాల్స్ (యాంటీబయాటిక్స్), క్యాన్సర్ మందులతో పాటు నార్కోటిక్, సైకోట్రోపిక్ ఔషధాలపై క్యూఆర్ కోడ్ (QR Code) లేదా బార్‌కోడ్ ముద్రించడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఔషధ తయారీదారులు మందుల యొక్క ప్రాథమిక ప్యాకేజింగ్ (Primary Packaging) పైనే క్యూఆర్ కోడ్‌ను ముద్రించాల్సి ఉంటుంది. ఒకవేళ అక్కడ స్థలం సరిపోకపోతే, సెకండరీ ప్యాకేజింగ్ (బాక్స్ లేదా వెలుపలి కవర్) పై ముద్రించవచ్చు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW), ‘డ్రగ్స్ రూల్స్, 1945’ నిబంధనలను సవరణలు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కీలక ఔషధ విభాగాలన్నింటినీ 'షెడ్యూల్ H2' పరిధిలోకి తీసుకువస్తూ ప్రస్తుత 'ట్రాక్ అండ్ ట్రేస్' (Track-and-Trace) విధానాన్ని మరింత విస్తరించింది. అయితే గతంలో ఈ క్యూఆర్ కోడ్ నిబంధన దేశంలోని కేవలం టాప్ 300 ఔషధ బ్రాండ్లకు మాత్రమే పరిమితమై ఉండగా, తాజా సవరణతో కీలకమైన మరియు అత్యవసర మందులన్నింటికీ ఇది వర్తించనుంది. మందుల జెనరిక్ మరియు బ్రాండ్ పేర్లు, తయారీదారు వివరాలు, లైసెన్స్ నంబర్, బ్యాచ్ నంబర్, మందుల తయారీ మరియు ఎక్స్‌పైరీ తేదీలు, మందులలో వాడిన ఇతర పదార్థాల (Excipients) వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.






