- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమగ్ర ఓటర్ల జాబితా రూపకల్పనకు కృషి చేయాలి : కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియతో తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.

దిశ, గద్వాల కలెక్టరేట్ : ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియతో తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఎస్ఐఆర్( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు గురువారం ఉదయం కలెక్టరేట్ నుంచి 2 కే రన్ ను జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జండా ఊపి ప్రారంభించారు. అధికారులు, విద్యార్థులు, ఓటర్లు పెద్దఎత్తున ర్యాలీలో పాల్గొని ఓటరు చైతన్యానికి సంబంధించిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ, ఓటరు చైతన్య నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ఈ రన్ లో పాల్గొన్నారు. కలెక్టరేట్ నుంచి రైల్వే ఫ్లైఓవర్ మీదుగా కృష్ణవేణి చౌరస్తా వరకు కొనసాగిన ఈ రన్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. మరణించిన వారి, అనర్హుల ఓట్లను తొలగించి ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు ఎస్ఐఆర్ ప్రక్రియ దోహదపడుతుందన్నారు.
ఈనెల 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవమును పురస్కరించుకొని వారోత్సవాలను జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించారన్నారు. డ్రగ్ రహిత జిల్లాగా పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నివారణ పై నిర్వాహకులు ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం కలెక్టర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు సే నో టు డ్రగ్స్ సిగ్నేచర్ క్యాంపెయిన్ బోర్డు పై తమ సంతకాలను చేశారు. ఐయాం ఎన్ యాంటీ డ్రగ్ షోల్డర్ బోర్డు వద్ద ఫోటోలను దిగారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ఎస్ఐఆర్ ప్రాముఖ్యత పై ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, అదనపు ఎస్పీ శంకర్, ఆర్డీవో శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో భూపాల్ రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, ఎన్నికల విభాగం అధికారులు, బీఎల్ఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.






