- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, కల్వకుర్తి: ఒక్క నిఘా నేత్రం వందమంది పోలీసులతో సమానమని అంటారు. కానీ అంతటి ప్రాముఖ్యత కలిగిన కెమెరాలు కల్వకుర్తి పట్టణ కేంద్రంలో సగానికి పైగా పనిచేయడం లేదు. 15 రోజుల క్రితం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో పలు కాలనీల్లో సగానికి పైగా కాలిపోయాయి. దీంతో నేరాలు, చోరీలు పెరిగే అవకాశముంది. జడ్చర్ల - కోదాడ జాతీయ రహదారిపై పలు కూడలిలో కల్వకుర్తి పోలీసులు కెమెరాలను అమర్చారు. ముఖ్యంగా సిల్వర్ జూబ్లీ క్లబ్ ఎదురుగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి క్షతగాత్రులు కాగా, మరికొందరు మృత్యువాతకు గురైన సంఘటనలున్నాయి.
కాబట్టి అక్కడ కెమెరాలు అమర్చిన జాతీయ రహదారిని వైపు కెమెరా నేల చూసేలా అమర్చడంతో నిరుపయోగంగా ఉంది. చాలాచోట్ల ఇదే తీరు ఉంది. ఈ మధ్య కాలంలో సీసీ కెమెరాలు కొన్ని మాత్రమే పనిచేస్తుండటంతో దొంగలను పట్టుకోవడం స్థానిక పోలీసులకు సవాల్‌గా మారింది. కల్వకుర్తిలో నేరాలు, చోరీలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా జోరుగా సాగుతుందని సమాచారం. కీలక ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసినప్పటికీ నిర్వహణ సరిగా లేకపోవడంతో అవి చాలా చోట్ల పనిచేయడం లేదు. ఇకనైనా అధికారులు, పోలీసులు వాటిపై దృష్టి సారించాలని పట్టణ ప్రజలు సూచిస్తున్నారు.






