- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ATM క్యాష్ వ్యాన్ చోరీ కేసులో బిగ్ ట్విస్ట్: తండ్రీకొడుకుల పక్కా మాస్టర్ స్కెచ్
హైదరాబాద్ ఐఎస్ సదన్ ఏటీఎం క్యాష్ వ్యాన్ చోరీ కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలోని ఐఎస్‌సదన్ (IS Sadan) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఏటీఎం రీఫిలింగ్ వ్యాన్ చోరీ కేసులో దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏటీఎంలలో డబ్బులు నింపే వ్యాన్ నుండే ఏకంగా రూ.17 లక్షల నగదును ఎత్తుకెళ్లిన ఘటనలో డ్రైవర్, అతడి కుమారులు కలిసి స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం మేరకు క్లియర్డ్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (Cleared Security Services Pvt Ltd) సంస్థకు చెందిన క్యాష్ వ్యాన్ రూ.30 లక్షల నగదుతో నగరంలోని వివిధ ఏటీఎంలలో రీఫిలింగ్ చేయడానికి బయలుదేరింది. వ్యాన్‌లో డ్రైవర్ శ్రీనివాస్‌తో పాటు క్యాష్ కస్టోడియన్లు సురేష్, పాపయ్య, గన్మెన్ నబీ సాబ్ మాత్రమే ఉన్నారు. ఇప్పటికే ఆరు ప్రాంతాల్లో సక్సెస్‌ఫుల్‌గా నగదు నింపిన వీరు.. చివరగా ఇది బజార్‌లోని ఎస్‌బీఐ (SBI) ఏటీఎం వద్దకు చేరుకున్నారు. క్యాష్ కస్టోడియన్లు సురేష్, పాపయ్యతో పాటు గన్మెన్ నబీ సాబ్ ఏటీఎం లోపలికి వెళ్లగా.. డ్రైవర్ శ్రీనివాస్ వ్యాన్ వద్దే ఒంటరిగా ఉన్నాడు. వ్యాన్‌లో రూ.7 లక్షల బ్యాగ్‌తో పాటు, రూ.17 లక్షల బ్యాగ్ మరొకటి ఉంది.
ముందే ప్లాన్.. కొడుకుతో కలిసి నగదుతో జంప్
అయితే, దొంగతనానికి కొన్ని నెలల క్రితమే జగిత్యాల జిల్లాకు చెందిన శ్రీనివాస్ క్లియర్డ్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో డ్రైవర్‌గా చేరాడు. దొంగతనం సరైన సమయం కోసం చూస్తున్న అతను.. ముందే ప్లాన్ ప్రకారం తన పెద్ద కుమారుడిని టూ వీలర్‌పై వ్యాన్‌ను ఫాలో చేయాలని చెప్పాడు. క్యాష్ కస్టోడియన్లు లోపలికి వెళ్లడమే ఆలస్యం.. వ్యాన్‌లో ఒంటరిగా ఉన్న శ్రీనివాస్ రూ.17 లక్షలు ఉన్న బ్యాగును తీసుకుని, బయట సిద్ధంగా ఉన్న కొడుకు బైక్‌పై ఎక్కి క్షణాల్లో పరారయ్యాడు. దీంతో భయంతో బయటకు వచ్చిన కస్టోడియన్లు డ్రైవర్, క్యాష్ బ్యాగ్ లేకపోవడాన్ని గమనించి లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురేష్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం వెంటనే ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
ఉప్పుగూడ To శంషాబాద్..
పొలీసుల విచారణలో భాగంగా సీసీటీవీ (CCTV) ఫుటేజీలను జల్లెడ పట్టిన పోలీసులకు బైక్‌పై పారిపోయింది తండ్రీకొడుకులేనని క్లారిటీ వచ్చింది. బైక్‌పై ఉప్పుగూడ వరకు వెళ్లిన నిందితులు, అక్కడ తమ చిన్న కుమారుడిని పిలిపించుకున్నారు. చోరీ చేసిన సొమ్ములో కొంత భాగాన్ని చిన్న కొడుకుకు ఇచ్చి పంపేసిన శ్రీనివాస్.. పెద్ద కొడుకుతో కలిసి అక్కడి నుంచి ఓ ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకుని శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) వైపు పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే, ప్రస్తుతం నిందితుల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.






