అమరావతిలో చారిత్రక ఘట్టం.. రాజధానిలో మొట్టమొదటి సినిమా షూటింగ్ ప్రారంభం

by Malleboina Mahesh |

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మొట్టమొదటి సినిమా షూటింగ్ ప్రారంభం.. బాలకృష్ణ ‘NBK 112’ చిత్రానికి క్లాప్ కొట్టిన మంత్రి నారా లోకేశ్!

అమరావతిలో చారిత్రక ఘట్టం.. రాజధానిలో మొట్టమొదటి సినిమా షూటింగ్ ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి (Amaravati) వేదికగా ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో మొట్టమొదటి క్రేజీ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) హీరోగా, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘NBK 112’ ముహూర్తపు వేడుకను గురువారం ఉదయం అమరావతిలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఏపీ ఐటీ, పాలిటిక్స్ రంగాల ప్రముఖులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ఈ చిత్రం తొలి ముహూర్తపు సన్నివేశానికి ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) క్లాప్‌ కొట్టగా, బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్వీని కెమెరా స్విచ్ ఆన్‌ చేశారు. అమరావతిని కేవలం పరిపాలనా నగరంగానే కాకుండా, అన్ని రంగాలకూ హబ్‌గా మార్చాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా.. ఇక్కడ తొలి సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు జరుపుకోవడం విశేషం. రాబోయే రోజుల్లో టాలీవుడ్‌కు సంబంధించిన మరిన్ని పెద్ద చిత్రాల షూటింగులు అమరావతి పరిసర ప్రాంతాల్లో జరగడానికి ఈ ప్రాజెక్ట్ ఒక మంచి నాందిగా నిలవనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.





Next Story