- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతర్జాతీయ ప్రయాణికులకు అలర్ట్: ‘ఎయిర్ సువిధ’ పోర్టల్ పునరుద్ధరణ
ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ‘ఎయిర్ సువిధ’ పోర్టల్ పున: ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: ఎబోలా (Ebola) ప్రభావిత దేశాల నుంచి, ఆయా దేశాల మీదుగా ప్రయాణించే అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఎయిర్ సువిధ (Air Suvidha) పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, సదరు ప్రయాణికులు ఇకపై తమ సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని విమానం దిగడానికి ముందే ఆన్‌లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
అయితే, గతంలో ఉన్న పేపర్ బేస్ విధానం స్థానంలో డిజిటల్ పద్ధతిని తీసుకురావడం వల్ల ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా మారనుంది. ఎబోలా వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి (PHEIC)గా ప్రకటించిన నేపథ్యంలో ఈ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు. ఎయిర్‌పోర్టులు, ఎంట్రీ పాయింట్ల వద్ద నిఘాను బలోపేతం చేయడానికి, అలాగే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రక్రియను వేగవంతం చేయడానికి ‘ఎయిర్ సువిధ’ ఆన్‌లైన్ విధానం ఎంతగానో దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.






