- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోడు గ్రామంలో తీవ్ర విషాదం.. నిన్న విద్యుత్ షాక్‌తో మహిళ.. నేడు అదే చోట వ్యక్తి ఆత్మహత్య!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని బోడు గ్రామంలో చోటు చేసుకున్న విషాద ఘటన గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

దిశ,టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని బోడు గ్రామంలో చోటు చేసుకున్న విషాద ఘటన గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బుధవారం విద్యుత్ షాక్‌తో మహిళ మృతి చెందిన ఘటన మరుసటి రోజే అదే చేనులో.. మరో వ్యక్తి ఆత్మహత్యకు దారితీయడం గ్రామంలో విషాదఛాయలు అలుముకునేలా చేసింది. బోడు గ్రామ పంచాయతీ సర్పంచ్ పోదేం స్వరూప అత్త పొదెం చుక్కమ్మ(55) బుధవారం మొక్కంపాడు గ్రామ సమీపంలోని ఓ పత్తి చేనులో కూలి పనులకు వెళ్లారు. ఈ క్రమంలో చేనుకు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ దాటే ప్రయత్నంలో విద్యుత్ ప్రవహిస్తున్న తీగ తగలడంతో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నారు. తోటి కూలీలు వెంటనే ఆమెను కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతి చెందారు.
అయితే ఈ ఘటన వెనుక ఉన్న పరిస్థితులు గ్రామంలో మరింత విషాదానికి కారణమయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. బోడు గ్రామానికి చెందిన మాడె పాపయ్య చేనులో ఫెన్సింగ్‌కి విద్యుత్ సరఫరా కావడంతో.. అదే విద్యుత్ ఫెన్సింగ్ వైర్‌కు విద్యుత్ ప్రవహించి చుక్కమ్మ మృతి చెందడంతో.. ఈ ఘటనలో తనపై కేసు నమోదవుతుందనే భయంతో, తీవ్ర మనస్తాపానికి గురైన మాడె పాపయ్య గురువారం చేనులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే పాపయ్య మృతికి గల ఖచ్చితమైన కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఒక కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చిన విద్యుత్ ప్రమాదం, మరో కుటుంబంలోనూ విషాదాన్ని నింపడం స్థానికులను కలచివేసింది.






