కాగజ్‌నగర్‌లో తప్పిన పెను ప్రమాదం

by Taduka Kalyani |

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణ కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం తప్పింది.

కాగజ్‌నగర్‌లో తప్పిన పెను ప్రమాదం
X

దిశ,కాగజ్‌నగర్: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణ కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం తప్పింది. పట్టణం లోని అయ్యంగార్ బెంగళూర్ బేకరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి మంటలను అదుపు చేయడంతో ఒక పెద్ద ముప్పు తృటిలో తప్పింది. బేకరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి దట్టమైన పొగలు, మంటలు వ్యాపించదంతో ఈ బేకరీకి సరిగ్గా ఆనుకుని ఒక పిల్లల ఆసుపత్రి ఉండడంతో అర్ధరాత్రి వేళ ఆసుపత్రిలో పలువురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. బేకరీ నుండి పొగలు రావడం గమనించిన స్థానికులు తక్షణమే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి, మంటలు పక్కనే ఉన్న చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు వ్యాపించకుండా అదుపు చేశారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేయడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో ఆసుపత్రిలోని రోగులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో బేకరీలోని 10 నుండి 15 లక్షల వరకు సామగ్రి కాలిబూడిదైనట్లు తెలిపారు.

Next Story