- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏయూకు రూ. 500 కోట్లు.. శతాబ్ధి ఉత్సవాల్లో సీఎం ప్రకటన
ఆంధ్రయూనివర్సిటీకి సీఎం చంద్రబాబు నాయుడు రూ. 500 కోట్లు ప్రకటించారు. అంతేకాకుండా కార్పస్ అభివృద్దిలో భాగంగా మరో రూ. 500 కోట్లు విరాళాలు సేకరించాలని ఆయన సూచించారు....

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రయూనివర్సిటీ(Andhra University)కి సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) రూ. 500 కోట్లు ప్రకటించారు. అంతేకాకుండా కార్పస్ అభివృద్దిలో భాగంగా మరో రూ. 500 కోట్లు విరాళాలు సేకరించాలని ఆయన సూచించారు. ఏయూలో చదివిన, చదువుతున్న విద్యార్థులు, ప్రొఫెసర్లు, విద్యా, వ్యాపార వేత్తలు విరాళాలు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి ఒక్క రూపాయి అయినా సరే కాంట్రిబ్యూట్ చేయాలని సూచించారు. ఏయూ శతాబ్ధి ఉత్స వేదిక నుంచి ప్రపంచంలోని వంద యూనివర్సిటీల్లో ఏయూ ఉండాలని, ఇందుకు అభివృద్ది అవసరమని చెప్పారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. మరో వందేళ్లలో ఏయూ మరో చరిత్ర క్రియేట్ చేయబోతోందన్నారు. దేశంలోనే బెస్ట్ బ్రాండ్‌గా తయారవుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏయూ వందేళ్ల సంబురాల్లో పాల్గొనడం తన పూర్వ జన్మ సుకృతమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏయూలో బంగారం లాంటి విద్యార్థులున్నారని, ప్రొఫెసర్లు ఉన్నారని తెలిపారు. ఏయూ.. దేశంలోనే టాప్-5లో ఉండాలని ఆకాంక్షించారు. తన మిత్రుడు పవన్ కల్యాణ్‌తో కలిసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని ముందుకొచ్చామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఏయూ అభివృద్ధి ఇక అన్‌స్టాపబుల్: శతాబ్ధి ఉత్సవాల్లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు






