- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షాల కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం
by Jakkula.Mamatha |
మండల కేంద్రంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గురువారం వర్షాలు కురవాలని వేడుకుంటూ రైతులు, ప్రజలు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు, జలాభిషేకం నిర్వహించారు.

X
దిశ, కమ్మర్ పల్లి: మండల కేంద్రంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గురువారం వర్షాలు కురవాలని వేడుకుంటూ రైతులు, ప్రజలు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు, జలాభిషేకం నిర్వహించారు. విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు జలకళ సంతరించుకోవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, పిల్లాపాపలతో సుఖంగా ఉండాలని నీళ్ల బిందెలు ఎత్తుకొని ఆలయాలకు చేరుకుని విగ్రహాలకు జలాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్యాల సుభాష్ గౌడ్ మాట్లాడుతూ.. వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో దైవ కృప కోసం అందరూ కలిసి పూజలు నిర్వహించామని, వానదేవుడు తమ ప్రార్థనలు ఆలకించి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story






