అర్ధరాత్రి ఒంటరిగా తిరుగుతున్న వృద్ధురాలు.. భయాందోళనకు గురైన స్థానికులు.. చివరికి!?

by Jakkula.Mamatha |

రాజంపేట్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా ఒంటరిగా తిరుగుతున్న వృద్ధురాలిని పోలీసులు గుర్తించారు.

అర్ధరాత్రి ఒంటరిగా తిరుగుతున్న వృద్ధురాలు.. భయాందోళనకు గురైన స్థానికులు.. చివరికి!?
X

దిశ, రాజంపేట్: రాజంపేట్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా ఒంటరిగా తిరుగుతున్న వృద్ధురాలిని పోలీసులు గుర్తించారు. రాజంపేట్ గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన చేపూరి ఎల్లవ్వ(70) అనారోగ్య కారణాలతో, మతి సరిగా పనిచేయక అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్లి బయట తిరుగుతుండగా చూసిన స్థానికులు అపోహతో భయాందోళనకు గురై 100కు డయల్ చేశారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు వృద్ధురాలిని గుర్తించి సమాచారం సేకరించి ఎస్సీ కాలనీలో ఉంటున్న కోడలు బాలమణికి స్థానికుల సమక్షంలో క్షేమంగా అప్పజెప్పారు. వృద్ధురాలిని రక్షించి మానవత్వంతో వ్యవహరిస్తూ కుటుంబానికి చేరువ చేసిన పోలీసులు హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ స్వామి గౌడ్ లను ఎస్సై బి మహేష్, స్థానికులు అభినందించారు.

Next Story