- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుణె రియల్టర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. కాబోయే భార్య, ప్రియుడి మధ్య 2,000 కాల్స్
యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ (26) హత్య కేసు విచారణలో పోలీసులు సంచలన విశాయాలను గుర్తించారు.

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రముఖ యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ (26) హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ అనుమానాస్పద హత్య కేసులో పోలీసులు విచారణ అనంతరం విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. కేతన్‌ను లోహగఢ్ కోటపైనుంచి నెట్టి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిల క్రూరమైన ప్లాన్ చూసి పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. జూన్ 18న జరిగిన ఈ ఘోర హత్యకు ముందు.. వీరిద్దరూ గత ఆరు నెలలుగా నిరంతరం టచ్‌లో ఉన్నట్లు బుధవారం పోలీసులు వెల్లడించారు.
పోలీసుల దర్యాప్తులో లభించిన కాల్ డేటా రికార్డుల (CDR) ప్రకారం.. సియా గోయల్, చేతన్ చౌదరి గత ఆరు నెలల్లో ఏకంగా 2,004 సార్లు ఫోన్లలో మాట్లాడుకున్నారు. వీరు దాదాపు 238 గంటల పాటు ఫోన్లలో గడపడం వెనుక కేతన్ అగర్వాల్‌ను ఎలా వదిలించుకోవాలనే పక్కా వ్యూహం దాగి ఉందని ఇన్వెస్టిగేషన్ అధికారులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన రోజైన జూన్ 18న.. వీరిద్దరూ ఒక కేఫేలో రహస్యంగా కలుసుకున్నారు. కేతన్‌ను పూర్తిగా ఎలా అంతమొందించాలనే దానిపై చర్చించడమే కాకుండా, లోహగఢ్ కోటపై నుంచి లోయలోకి నెట్టివేయడానికి ఏ స్పాట్ అయితే బాగుంటుందో కూడా ముందే రెక్కీ నిర్వహించి గుర్తించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం నిందితులు ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.






