- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘దిశ’ కథనానికి స్పందన.. హద్దు రాళ్లు తొలగించిన రెవెన్యూ అధికారులు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పసుమాముల రెవెన్యూ పరిధిలో కబ్జా బాగోతంపై ‘దిశ’ పత్రిక రాసిన ‘రూ.15కోట్ల ప్రభుత్వ భూమిపై కన్ను!’ కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు.

దిశ, రంగారెడ్డి బ్యూరో: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పసుమాముల రెవెన్యూ పరిధిలో కబ్జా బాగోతంపై ‘దిశ’ పత్రిక రాసిన ‘రూ.15కోట్ల ప్రభుత్వ భూమిపై కన్ను!’ కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. సర్వే నెంబర్ 386/1లో సుమారు 2700 గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి చుట్టూ కడీలు పాతారు. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికారులు రెండు రోజుల క్రితం ఆక్రమణ స్థలం వద్దకు వెళ్లి మొక్కుబడిగా బోర్డు ఏర్పాటు చేసి వచ్చారు. అధికారుల ద్వంద్వ నీతిపై ‘దిశ’ ప్రచురించిన కథనానికి రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. గురువారం మరోసారి బోర్డు ఏర్పాటు చేసిన ప్రాంతం వద్దకు వెళ్లి ఆర్‌ఐ రాము, జిపివో దయానంద్ ల సమక్షంలో జెసిబితో హద్దు రాళ్లు తొలగించారు. అయితే గతంలో కూడా రెవెన్యూ అధికారులు బోర్డు పాతినప్పటికీ కబ్జారాయుళ్లు బోర్డును తొలగించి ఆక్రమించారు. గత అనుభవాల దృష్ట్యా కూల్చివేతల ప్రాంతంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.






