మంగళగిరి ప్రీమియర్ లీగ్.. మైదానంలోకి దిగిన మంత్రి లోకేశ్‌.. క్రికెట్‌తో క్రేజీ సందడి

by Ramesh Naini |   (  Updated:2026-01-17 04:12:12  IST  )

సంక్రాంతి సంబరాల్లో భాగంగా మంగళగిరి నియోజకవర్గం అంతటా సాంస్కృతిక, క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు.

మంగళగిరి ప్రీమియర్ లీగ్.. మైదానంలోకి దిగిన మంత్రి లోకేశ్‌.. క్రికెట్‌తో క్రేజీ సందడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంక్రాంతి సంబరాల్లో భాగంగా మంగళగిరి నియోజకవర్గం అంతటా సాంస్కృతిక, క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. మహిళల కోసం ముగ్గుల పోటీలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, యువత కోసం క్రికెట్, వాలీబాల్ పోటీలు నిర్వహించి పండుగ సందడిని మరింత పెంచారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు సైతం పోటీల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మంగళగిరి బైపాస్ రోడ్డులోని బోగి ఎస్టేట్స్‌లో నిర్వహిస్తున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) సీజన్-4 క్రికెట్ పోటీల్లో మంత్రి నారా లోకేశ్ పాల్గొని క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు.

ఎంపీఎల్-4లో భాగంగా 27వ రోజు మూడో రౌండ్ చివరి మ్యాచ్‌లో వల్లభనేని వెంకట్రావ్ యూత్, విక్కీ 11 జట్ల మధ్య జరిగిన పోరుకు మంత్రి నారా లోకేశ్ టాస్ వేశారు. అనంతరం సరదాగా కొద్దిసేపు క్రికెట్ ఆడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన మైదానంలోకి దిగడంతో యువత ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను మంత్రి నారా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read More..

నేడు కాకినాడలో సీఎం.. డిప్యూటీ సీఎం పర్యటన

Next Story