- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు కాకినాడలో సీఎం.. డిప్యూటీ సీఎం పర్యటన
భారీ పెట్టుబడులు పెట్టనున్న గ్రీన్ కో గ్రూప్.

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కాకినాడలో (Kakinada) పర్యటించనున్నారు. తమ పర్యటనలో భాగంగా రాష్ట్ర పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా నిలిచే ప్రతిష్ఠాత్మక 'గ్రీన్ అమ్మోనియా ప్లాంట్'కు శంకుస్థాపన చేయనున్నారు.. గ్రీన్‌కో గ్రూప్‌కు చెందిన ఏఎం గ్రీన్ (AM Green) సంస్థ సుమారు రూ. 13 వేల కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపడుతోంది. కాకినాడలోని గతంలో నాగార్జున ఫెర్టిలైజర్స్ ఉన్న సుమారు 495 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. ఏడాదికి ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభం కానున్న ఈ పరిశ్రమను, భవిష్యత్తులో 1.5 మిలియన్ టన్నులకు పెంచనున్నారు. ముఖ్యంగా ఎటువంటి కర్బన ఉద్గారాలు లేకుండా అత్యాధునిక గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత సాంకేతికతతో ఇక్కడ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తారు. పర్యావరణ హితంగా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్టు ద్వారా సుమారు 2,600 మందికి పైగా యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని అధికారులు చెబుతున్నారు. క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీని ప్రపంచ పటంలో నిలబెట్టే దిశగా ప్రభుత్వం వేస్తున్న ఈ అడుగు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేయనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read More..






