"మన శంకర వరప్రసాద్ గారు" ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే ?

by velandi.Saikiran |   (  Updated:2026-01-13 06:13:12  IST  )

తొలిరోజు ప్రీమియర్స్ తో కలిపి ఇండియా వ్యాప్తంగా రూ.84 కోట్లు వసూలు చేసినట్లు ప్రముఖ సంస్థ ప్రకటన చేసింది.

మన శంకర వరప్రసాద్ గారు ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్‌గారు ( Mana Shankara Vara Prasad Garu) సినిమా భారీ కలెక్షన్స్ వైపు దూసుకు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో జనాలు ఎగబడి చూస్తున్నారట. దానికి తోడు సంక్రాంతి హాలిడేస్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా టికెట్లను భారీ సంఖ్యలో బుక్ చేసుకుంటున్నారు జనాలు.

ఈ నేపథ్యంలోనే తొలిరోజు ప్రీమియర్స్ తో కలిపి ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.84 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటన చేసింది. ఇందులో సోమవారం ఒక్క రోజు 65 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసినట్లు టాక్ నడుస్తోంది. అలాగే ప్రీమియర్ షోల ద్వారా రూ.15 కోట్లకు పైగా మన శంకర వరప్రసాద్‌గారు సినిమా రాబట్టిన‌ట్లు తేలిందట. దర్శకుడు అనిల్ రావిపూడి కమర్షియల్ టచ్, పండగ సీజన్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా మరో వారం రోజుల పాటు భారీగా కలెక్షన్స్ రాబట్టే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు.

ఇరగదీసిన చిరంజీవి, విక్టరీ వెంకటేష్

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్‌గారు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన అర్ధరాత్రి రిలీజ్ అయింది. ఈ మూవీలో చిరంజీవి హీరోగా చేయగా నయనతార హీరోయిన్ గా మెరిసిన సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ లో కనిపించారు. దాదాపు 20 నిమిషాల పాటు వెంకటేష్ పాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా చిరంజీవి, విక్టరీ వెంకటేష్ స్క్రీన్ పై ఇరగదీసారట. దానికి తోడు దర్శకుడు అనిల్ రావిపూడి టైమింగ్.. బాగా కలిసి వచ్చినట్లు చెబుతున్నారు.

Read More..

బాల‌య్య‌కు షాక్‌..అఖండ 2 రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన చిరు !



Next Story