Mahaanadu: కార్యకర్తే అధినేత అనేది ఇక పార్టీ సిద్ధాంతం.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-28 06:41:00  IST  )

కార్యకర్తే అధినేత అనేది ఇక నుంచి తమ పార్టీ సిద్ధాంతమని సీఎం చంద్రబాబు అన్నారు.

Mahaanadu: కార్యకర్తే అధినేత అనేది ఇక పార్టీ సిద్ధాంతం.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కార్యకర్తే అధినేత అనేది ఇక నుంచి తమ పార్టీ సిద్ధాంతమని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ మహానాడులో రెండు రోజు ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాల కోసమే ఆరు శాసనాలని తెలిపారు. తనకు తెలుగు జాతే ముఖ్యమని.. ఎన్ని జన్మలైనా ఇక్కడే పుడతానని భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఆశయాలే టీడీపీకి స్ఫూర్తి అని అన్నారు. కార్యకర్తే అధినేత అనేది ఇక పార్టీ సిద్ధాంతమని స్పష్టం చేశారు. 40 శాతం మంది యువతకు గత ఎన్నికల్లో సీట్లు ఇచ్చామని తెలిపారు. 61 మంది యువత ఎమ్మెల్యేలు, ఎంపీలుగా విజయం సాధించారని గుర్తు చేశారు. లోకేశ్ ప్రవేశపెట్టిన ఆరు శసనాలు సరికొత్త చరిత్రను నాంది అని అన్నారు. లోకేశ్ మహానాడును మలుపు తిప్పారని కామెంట్ చేశారు. సాధారణ కార్యకర్తలను కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలను చేసిన చరిత్ర టీడీపీదేనని అన్నారు. ప్రజాభిప్రాయం మేరకు నాయకులకు అవకాశాలు కల్పిస్తున్నామని భవిష్యత్తులోనూ కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు మెచ్చే పాలన టీడీపీ నాయకులు అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

Also Read..

దిశ’ మహానాడు సంచిక చాలా బాగుంది.. CM చంద్రబాబు ప్రశంస

CM చంద్రబాబు చేతిలో ‘దిశ’ ప్రత్యేక సంచిక


Next Story