Mahaanadu: టీడీపీ బలమైన రాజకీయ శక్తి.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-28 05:22:22  IST  )

కడప (Kadapa) వేదికగా ప్రారంభమైన టీడీపీ నాయకులు, కార్యకర్తల పండుగ ‘మహానాడు’ (Mahaanadu) అంగరంగ వైభవంగా కొనసాగుతోంది.

Mahaanadu: టీడీపీ బలమైన రాజకీయ శక్తి.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కడప (Kadapa) వేదికగా ప్రారంభమైన టీడీపీ నాయకులు, కార్యకర్తల పండుగ ‘మహానాడు’ (Mahaanadu) అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి కార్యక్రమానికి లక్షల్లో తరలివస్తున్నారు. మహానాడు రెండో రోజులో భాగంగా ఇవాళ 102వ జయంతి సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావుకు నివాళులర్పించనున్నారు. ఇవాళ సభలో రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధిపై వక్తలు మాట్లాడనున్నారు. తెలుగు జాతి - విశ్వ ఖ్యాతి, టీడీపీ విజయాలు, చంద్రబాబు (Chandrababu) పాలనపై చర్చించనున్నారు. అదేవిధంగా స్త్రీ శక్తి, మహిళా సంక్షేమం, సాధికారత వంటి అంశాలు చర్చకు రానున్నాయి. మధ్యాహ్నం తరువాత, సామాజిక న్యాయం - పేదల ప్రగతిపై చర్చించనున్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగం, సాగునీటి ప్రాజెక్టులపై ప్రసంగించనున్నారు. ఇక చివరగా ప్రజల సంరక్షణ - శాంతి భద్రతలు, రాజకీయ తీర్మానాలు చేయనున్నారు. అనంతరం టీడీపీ (TDP) అధ్యక్షుడి ఎన్నిక, ప్రమాణ స్వీకారం, ప్రసంగంతో రెండో రోజు మహానాడు ముగియనుంది.

ఇవాళ మహానాడు వేదిక వద్ద మంత్రి నారాయణ (Minister Narayana) మాట్లాడుతూ.. టీడీపీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ అని అన్నారు. మహానాడులో ప్రసంగించిన నేతలు గొప్ప నాయకులు అయ్యారని పేర్కొన్నారు. పార్టీ కోసం పని చేసిన నాయకులు, కార్యకర్తలను చంద్రబాబు ఎన్నడూ మరువలేదని.. వారికి సముచితం స్థానం ఇచ్చి కాపాడుకుంటూ వస్తున్నారని తెలిపారు. ఏది ఏమైనా టీడీపీ బలమైన రాజకీయ శక్తి అంటూ కామెంట్ చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు.

Also Read..

దిశ’ మహానాడు సంచిక చాలా బాగుంది.. CM చంద్రబాబు ప్రశంస

CM చంద్రబాబు చేతిలో ‘దిశ’ ప్రత్యేక సంచిక

Next Story