- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చౌడేశ్వరి పరువుహత్య కేసు : సీఐపై సస్పెన్షన్ వేటు
చౌడేశ్వరి పరువు హత్యకేసు కీలక మలుపు తిరిగింది. ఆమె హత్యకు సహకరించిన మాచర్ల సీఐను జిల్లా ఎస్పీ సస్సెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పల్నాడు జిల్లాలో గత నెల 18న పరువు హత్యకు గురైన చౌడేశ్వరి కేసులో.. మాచర్ల సీఐ వెంకట రమణపై సస్పెన్షన్ వేటు పడింది. ఆమె హత్యకేసులో తల్లిదండ్రులతోపాటు సీఐ పాత్ర కూడా ఉందని విచారణలో తేలడంతో.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అతన్ని వెంటనే సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రియుడు నాగరాజును పెళ్లి చేసుకున్న కూతురిపై చౌడేశ్వరి తల్లిదండ్రులు కోపం పెంచుకున్నారు. తమను కాదని వెళ్లిపోయిన కూతుర్ని అంతమొందించాలని భావించారు. ఇందుకు చౌడేశ్వరిని తిరిగి ఇంటికి తీసుకొచ్చేందుకు సీఐ వెంకటరమణ సహకరించాడు. ఈ పనికోసం సీఐ వారి నుంచి భారీగా డబ్బు తీసుకున్నట్లు తేలింది. తొలుత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించగా.. ఆ సమయంలో సీఐ లేకపోవడంతో ఆ కుట్రలేవీ సాగలేదు. పోస్టుమార్టం రిపోర్టులో ఆత్మహత్య కాదని తేలడంతో అసలు విషయం బయటపడింది. సీఐపై ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు అతని పాత్రపై విచారణ చేశారు. కీలకంగా వ్యవహరించాడని తేలడంతో సస్పెండ్ చేశారు.






