విజయవాడ ఉగ్ర లింకుల కేసు.. నిందితుల విచారణలో కీలక ఆధారాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-05 11:21:03  IST  )

విజయవాడలో కలకలం రేపిన ఉగ్ర లింకుల కేసులో నిందితుల కస్టడీ విచారణ ఐదో రోజు సైతం కొనసాగుతోంది. విజయవాడ టాస్క్ ఫోర్స్ కార్యాలయం కేంద్రంగా నిందితులను ఇంటెలిజెన్స్ అధికారులు విడివిడిగా విచారిస్తున్నారు...

విజయవాడ ఉగ్ర లింకుల కేసు.. నిందితుల విచారణలో కీలక ఆధారాలు
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో కలకలం రేపిన ఉగ్ర లింకుల కేసు(Terrorists Case)లో నిందితుల కస్టడీ(Custody) విచారణ ఐదో రోజు సైతం కొనసాగుతోంది. విజయవాడ టాస్క్ ఫోర్స్ కార్యాలయం(Vijayawada TaskForce) కేంద్రంగా నిందితులను ఇంటెలిజెన్స్ అధికారులు(Intelligence Officers) విడివిడిగా విచారిస్తున్నారు. రహంతుల్లా షరీఫ్, మహ్మద్ డానిష్, మీర్జా సొహైల్ బేగ్, సైదా బేగం, అబ్దుల్ సలామ్‌ను నాలుగు రోజులుగా ప్రశ్నించారు. నిందితుల నుంచి కీలకమైన సమాచారాన్ని సేకరించారు. ప్రధానంగా అంతర్జాతీయ ఉగ్ర సంస్థలతో నిందితులకు ఉన్న సంబంధాలు, స్థానికంగా వారు పన్నిన కుట్రల కోణంపై విచారణ ముమ్మరం చేశారు.

ఇక విచారణలో పలు ఎలక్ట్రానిక్ పరికరాలను, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి అందిన నిధులు, డిజిటల్ నెట్‌వర్క్ ద్వారా సాగించిన కమ్యూనికేషన్లపై నిందితులను లోతుగా ఆరా తీస్తున్నారు. ఐదుగురు నిందితులు ఇచ్చిన సమాచారంలో వైరుధ్యాలు ఉండటంతో, వారిని వేర్వేరుగా విచారిస్తూ రహస్యాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

చౌడేశ్వరి పరువుహత్య కేసు : సీఐపై సస్పెన్షన్ వేటు

Next Story