- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతి పందేల జోష్.. గోదావరి జిల్లాల్లో హోటళ్లు, లాడ్జీలు హౌస్ ఫుల్
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సందడి మొదలైంది. పట్నం పల్లెబాట పట్టగా.. బస్సులు, రైళ్లన్నీ ఫుల్లయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సందడి మొదలైంది. పట్నం పల్లెబాట పట్టగా.. బస్సులు, రైళ్లన్నీ ఫుల్లయ్యాయి. సొంతవాహనాల్లో సొంతూరికి వెళ్తుండటంతో హైవేలపైనా వాహనాల రద్దీ దర్శనమిస్తోంది. ఆంధ్రాలో సంక్రాంతి అంటే అందరికీ ముందు గుర్తొచ్చేది ఉభయ గోదావరి జిల్లాలు. అతిథులకు ఆతిథ్యమివ్వడంలో వాళ్లకు సాటి ఎవరూ లేరన్న నానుడి ఉంది. అందుకు తగ్గట్టే అక్కడ ఏర్పాట్లు ఉంటాయి. ఇక గోదావరి జిల్లాల్లో కోడి పందేలు ఏ స్థాయిలో జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోట్ల రూపాయలు పందేల కోసం చేతులు మారనున్నాయి. కోడి పందేలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే భీమవరంలో ఈసారి పండుగ జోష్.. గతేడాదికంటే డబుల్ గా కనిపిస్తోంది. ఇక్కడి కోడి పందేలను చూసేందుకు ఏపీలో ఉన్నవారే కాదు.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా జనం తరలివస్తుంటారు. దీంతో భీమవరంతో పాటు చుట్టుపక్కల టౌన్లలో ఉన్న లాడ్జీలు, హోటళ్లలో గదులకు భారీ గిరాకీ ఏర్పడింది.
మూడు రోజుల ప్యాకేజీ రూ.లక్ష
భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, కాకినాడ, రాజమండ్రి వంటి పట్టణాల్లో సుమారు 150 హోటళ్లలో ఒక్క గది కూడా ఖాళీగా లేదంటే.. డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అంచనా వేయొచ్చు. ఈ డిమాండ్ ను సాకుగా చూపించి.. హోటళ్లు, లాడ్జీల యజమానులు గదుల అద్దెలను భారీగా పెంచేశారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా.. రద్దీ ఉన్నప్పుడే తమకు నాలుగు రూపాయలు వెనకేసుకునే అవకాశం వస్తుందంటున్నారు. సాధారణ రోజుల్లో రోజుకు రూ.1000 - రూ.5000 ఉండే గది అద్దెను ప్యాకేజీల కింద డివైడ్ చేశారు. మూడురోజులకైతే రూ.30 వేలు నుంచి రూ.60 వేలు వరకూ డిమాండ్ చేస్తున్నారు. కొన్ని స్టార్ హోటళ్లలో అయితే ఒక్కో గదికి రూ.లక్ష వసూలు చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు వచ్చిన పర్యాటకులు తప్పక యజమానులు అడిగిన అద్దెను చెల్లించి ఉంటున్నారు. రాజకీయ నాయకులు కూడా గెస్ట్ హౌస్ లను ముందే రిజర్వ్ చేయడంతో పర్యాటకులకు వసతి కష్టాలు మొదలయ్యాయి. కల్యాణ మండపాలు, హోమ్ స్టే లు సైతం అద్దెకు తీసుకుంటున్నారు.
తాడేపల్లిగూడెంలో భారీ కోడిపందెంకు సిద్ధం
కోడిపందేల విషయానికొస్తే.. ఈసారి బరుల వద్ద పందేల జోరు మరింత పెరగనుంది. నిర్వాహకులు ఇప్పటికే పందెం రాయుళ్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం ఈసారి తాడేపల్లిగూడెంలో రూ.2.5 కోట్లతో భారీ పందెం జరగనుండగా.. సీసలి, నారాయణపురం, చినఅమిరం వంటి ప్రాంతాల్లో రూ.కోటి పందేలు వేసేందుకు సిండికేట్లు సిద్ధమవుతున్నాయి. గతేడాది కోడిపందేల్లో గెలిచిన పందెంరాయుళ్లను బరులకు రప్పించేందుకు పోటీ పడుతున్నారు. గోదావరి జిల్లాల్లో కోడిపందేలు చూసేందుకు సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలు కూడా విచ్చేస్తారు.
Read More..






