- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డోన్ టీడీపీలో కోట్ల వర్సెస్ సుబ్బారెడ్డి.. పోటా పోటీ ప్రచారం
వచ్చే ఎన్నికల్లో డోన్ టీడీపీ అభ్యర్థిగా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిని అధినేత చంద్రబాబు ప్రకటించారు...

X
దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో డోన్ టీడీపీ అభ్యర్థిగా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిని అధినేత చంద్రబాబు ప్రకటించారు. అయితే అదే నియోజకవర్గానికి చెందిన మరో టీడీపీ నేత ధర్మవరం సుబ్బారెడ్డి వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను కూడా పోటీలో ఉంటానని చెబుతున్నారు. అంతేకాదు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి నిర్వహించిన ర్యాలీకి పోటీగా శనివారం డోన్‌లో ఆయన ర్యాలీ నిర్వహించారు. తనపై పోటీ చేసి గెలవాలని మీసం మెలేసి మరీ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం గ్యారంటీ అని.. గెలవడం కూడా ఖాయమని స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితం డోన్ అభ్యర్థిగా చంద్రబాబు తనను ప్రకటించారని.. ఇప్పుడు మరో వ్యక్తిని ఖరారు చేశారని సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాత్రం ఈసారి డోన్ నుంచి పోటీలో ఉండి తీరతానని సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Read More..
Next Story






