నా భర్తను ఇలానే కొడితే ఇంటినుండి వెళ్లిపోయాడు..బాధితురాలు శిరీష ఆవేదన

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-17 06:02:25  IST  )

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నారాయణపురంలో అప్పు తీర్చలేదని మహిళను వడ్డీ వ్యాపారి చెట్టుకు కట్టేసిన సంగతి తెలిసిందే.

నా భర్తను ఇలానే కొడితే ఇంటినుండి వెళ్లిపోయాడు..బాధితురాలు శిరీష ఆవేదన
X

దిశ‌, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నారాయణపురంలో అప్పు తీర్చలేదని మహిళను వడ్డీ వ్యాపారి చెట్టుకు కట్టేసిన సంగతి తెలిసిందే. మనికన్నప్ప అనే వ్యక్తి వద్ద శిరీష భర్త రూ.80వేలు అప్పు చేయగా చెట్టుకు కట్టేసి ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సైతం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా బాధితురాలు శిరీష ఘటనకు సంబంధించి మీడియాతో మాట్లాడారు. తన పిల్లల టీసీ కోసం నారాయణ పురం వెళ్లినట్టు తెలిపారు.

దారి మధ్యలో అడ్డుపడి టీసీ చింపేయాలని ప్రయత్నించారని అన్నారు. తాను టీసీ లాక్కోవడంతో చెట్టుకు కట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను కూడా ఇదే విధంగా వేధించారని, ఆ అవమానంతో ఇల్లు విడిచి వెళ్లిపోయాడని తెలిపారు. చాలా దారుణంగా కొట్టారని, పిల్లాడిని కూడా లాగి పడేశారని చెప్పారు. తాళ్లతో కొట్టి చంపేస్తామని బెదిరించారని అన్నారు. దారినపోయే వాళ్లు విడిచిపెట్టాలని కోరినా విడిచిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలా చేస్తారని ముందే తెలుసని, కానీ పిల్లల భవిష్యత్ కోసం టీసీ తీసుకువచ్చేందుకు వెళ్లానని అన్నారు. మునికన్నప్ప, వెంకటమ్మ, రాజా, జగదీశ్వరి తనపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు.

Trending: మహిళను చెట్టుకు కట్టేసిన ఘటన.. సీఎం చంద్రబాబు సీరియస్

సీఎం నియోజకవర్గంలో దారుణం.. అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

Next Story