Trending: మహిళను చెట్టుకు కట్టేసిన ఘటన.. సీఎం చంద్రబాబు సీరియస్

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-17 05:57:31  IST  )

సాక్షాత్తూ ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) నియోజకవర్గమైన కుప్పంలో అప్పు తీర్చలేదని ఓ మహిళను పట్టపగలు నిర్దాక్షిణ్యంగా చెట్టుకు కట్టేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది.

Trending: మహిళను చెట్టుకు కట్టేసిన ఘటన.. సీఎం చంద్రబాబు సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: సాక్షాత్తూ ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) నియోజకవర్గమైన కుప్పంలో అప్పు తీర్చలేదని ఓ మహిళను పట్టపగలు నిర్దాక్షిణ్యంగా చెట్టుకు కట్టేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. అందుకు సంబంధించి వీడియోలు సైతం సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. మహిళపై దాడి చేసిన వారిపై వెంటనే అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం సీఎం ఎస్పీతో మాట్లాడగా.. నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటను పునరావృతం కాకుండా చూడాలని పోలీసు ఉన్నతాధికారులకు వార్నింగ్ ఇచ్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

కాగా, కుప్పం (Kuppam) మండల పరిధిలోని నారాయణపురం (Narayanapuram) గ్రామానికి చెందిన శిరీష, భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన ముని కన్నప్ప వద్ద మూడేళ్ల క్రితం రూ.80 వేలు అప్పుగా తీసుకున్నారు. అయితే, తీసుకున్న అప్పుకు వడ్డీ పెరుగుతూ.. పుట్టెడు అప్పుగా మారింది. దీంతో చేసిన అప్పు తీర్చలేక భార్య, బిడ్డలను వదిలేసిన భర్త తిమ్మరాయప్ప గ్రామం విడిచి వెళ్లిపోయాడు. కానీ, భార్య శిరీష మాత్రం అదే గ్రామంలో ఉంటూ కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఈ క్రమంలో తనకు రావాల్సిన డబ్బు ఇవ్వాలని మునికన్నప్ప, శిరీష ఇంటికి వెళ్లాడు. ఆమెను బూతులు తిడుతూ.. ఏకంగా ఇంట్లోంచి లాక్కెళ్లి గ్రామస్థులు ఎదుటే తనకు డబ్బులు ఎప్పడిస్తావంటూ పక్కనే ఉన్న వేప చెట్టుకు తాడుతో కట్టేశాడు. ఆ తతంగాన్ని మొత్తం అక్కడే ఉన్న ఒకరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ ఘటనపై తాజాగా సీఎం చంద్రబాబు స్పందించి నిందితలపై కఠిన చర్యలకు ఆదేశించారు.

నా భర్తను ఇలానే కొడితే ఇంటినుండి వెళ్లిపోయాడు..బాధితురాలు శిరీష ఆవేదన

Next Story