- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం నియోజకవర్గంలో దారుణం.. అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలు
తీసుకున్న అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘోరమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో వెలుగుచూసింది.

దిశ, వెబ్ డెస్క్: తీసుకున్న అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘోరమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష, భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన ముని కన్నప్ప వద్ద 3 సంవత్సరాల క్రితం 80,000 వేలు రూపాయలు అప్పు తీసుకున్నారు. అయితే ఆ అప్పుకు వడ్డీ కలిసి మొత్తం అప్పు పెరిగిపోయింది. దీంతో ఆ అప్పు అప్పు తీర్చలేక భార్య, బిడ్డలను వదిలేసి భర్త తిమ్మ రాయప్ప గ్రామం విడిచి వెళ్లిపోయాడు. అయితే భార్య శిరీష మాత్రం అదే గ్రామంలో ఉంటూ.. కూలి పనులు చేసుకుంటూ పిల్లలు పోషించుకుంటూ అప్పులు తీరుస్తుంది.
ఈ క్రమంలో తనకు ఇవ్వాల్సిన అప్పును సకాలంలో చెల్లించ లేదని ముని కన్నప్ప ఆగ్రహించి.. శిరీష రోడ్డుపై వెళ్తుండగా అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు. దీంతో ఆమె అతనితో వాగ్వాదానికి దిగగా.. కోపంతో రెచ్చిపోయిన ముని కన్నప్ప మహిళా అని కూడా చూడకుండా.. ఆమెను లాక్కెళ్లి.. తాడుతో బలవంతంగా వేప చెట్టుకు కట్టేసి తన డబ్బులు ఎప్పుడిస్తావో చెప్పాలంటు కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో ఇలాంటి దారుణం జరిగితే.. మిగిలిన ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి ఏంటని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. మరి ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, హోమంత్రి, డిప్యూటీ సీఎంలు ఏ విధంగా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.






