దూసుకొస్తున్న తీవ్ర తుపాను.. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కీలక విజ్ఞప్తి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-28 04:37:00  IST  )

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తుపాను తీవ్ర తుపానుగా మారి తీరం వైపు దూసుకొస్తోంది.

దూసుకొస్తున్న తీవ్ర తుపాను.. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కీలక విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తుపాను తీవ్ర తుపానుగా మారి తీరం వైపు దూసుకొస్తోంది. సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేసింది. మొంథా తుపాన్ ను ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. కొండ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. ప్రజలెవరూ చెట్ల కింద నిలబడవద్దని, విద్యుత్ స్తంభాలకు సమీపంలో ఉండద్దని తెలిపింది. అలాగే భారీ వర్షాల నేపథ్యంలో నీటి ప్రవాహం ఎక్కుగా ఉన్న రోడ్లలో వాహనాలను నడపవద్దని తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం 112 టోల్ ఫ్రీ నంబర్, కంట్రోల్ రూమ్ నంబర్ 9154970454 నంబరును సంప్రదించాలని తెలిపింది.

Read More..

తీవ్ర తుపానుగా మొంథా.. ఏపీ సహా యానాం, సౌత్ ఒడిశాకు రెడ్ అలర్ట్

Next Story