- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తీవ్ర తుపానుగా మొంథా.. ఏపీ సహా యానాం, సౌత్ ఒడిశాకు రెడ్ అలర్ట్
తీవ్రతుపాను తీరందాటే సమయంలో.. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న మొంథా తుపాను ఏపీ తీరంవైపు వేగంగా దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదిలిన తుపాన్.. తీవ్ర తుపానుగా బలపడినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం మచిలీపట్నంకు 190 కిలోమీటర్లు, కాకినాడకు 270 కిలోమీటర్లు, విశాఖపట్నంకు 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. తుపాను తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ.. సముద్రంలో అలల ఉద్ధృతి పెరుగుతోంది. తీవ్రతుపానుగానే మొంథా తీరం దాటుతుందని, సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ - మచిలీపట్నం మధ్య తీరం దాటే ఛాన్స్ ఉన్నట్లు APSDMA పేర్కొంది.
తీవ్రతుపాను తీరందాటే సమయంలో.. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. అలాగే చెట్లు, హోర్డింగుల సమీపంలో ఉండరాదని తెలిపింది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ అతిభారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఏపీ జిల్లాలతో పాటు యానాం, దక్షిణ ఒడిశాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుపాను ప్రభావంతో మచిలీపట్నంలో భారీ వర్షం కురుస్తుండగా.. మార్కెట్లో కూరగాయలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. మంగినపూడిలో సముద్రం 500 మీటర్లు ముందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు విశాఖపైనా మొంథా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రపు అలలు 8 నుంచి 10 అడుగుల ఎత్తుకు ఎగసి పడుతుండటంతో.. పర్యాటకులెవరినీ పోలీసులు సముద్రం వద్దకు అనుమతించడం లేదు. రాకాసి అలలు, భీకర గాలులతో పాటు కుండపోత వర్షం కురుస్తుండటంతో విశాఖలో జనజీవనం స్తంభించింది.
కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో సముద్ర కెరటాల ఉద్ధృతి పెరిగింది. ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు కెరటాల ఉద్ధృతికి ధ్వంసమైంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఉప్పాడ తీరం భారీగా కోతకు గురవుతోంది.
Read More..
బలపడుతోన్న ‘మొంథా’ తుపాన్.. కాకినాడ పోర్టుకు ఏడో ప్రమాద హెచ్చరిక






