- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖాతాల్లో డబ్బులు వేశాం.. చూసుకోండి: రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
రాష్ట్రంలోని 48 లక్షల 85 వేల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు వేశామని, చూసుకోండని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని 48 లక్షల 85 వేల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు వేశామని, చూసుకోండని సీఎం చంద్రబాబు నాయుడు (Cm Chandrababu Naidu) అన్నారు. కృష్ణా జిల్లా(Krishna District) గన్నవరం నియోజకవర్గం(Gannavaram Constituency) సూరంపల్లిలో ‘అన్నదాత సుఖీభవ’(Annadata SukhiBhava) ఆర్థిక సాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రూ.6 వేల చొప్పున అన్నదాత సుఖీభవ డబ్బులు 99 శాతం అకౌంట్లలో వేశామని చెప్పారు. రైతులు కూడా టెక్నాలజీని వినియోగించుకుంటున్నారని తెలిపారు. రైతుల ఖాతాల్లో ప్రతి సంవత్సరం రూ. 20 వేలు ఇస్తున్నామని చెప్పారు. ధాన్యం తీసుకున్న తర్వాత 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. రైతులను ఆదుకుంటామని చెప్పామని, ఇప్పుడు ఒక్కొక్కరికి రూ.6 వేలు ఇస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
కేంద్రంతో పాటు మేమూ ఇస్తున్నాం
కేంద్రప్రభుత్వం రూ. 6 వేలు ఇస్తుంటే తాము రూ. 14 వేలు కలిపి ఇస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. రైతులకు చాలా కార్యాక్రమాలు అమల్లోకి తీసుకొచ్చామని, తాను రైతు బిడ్డనేనని, అందుకే వాళ్ల కష్టాలు తెలుసని చంద్రబాబు తెలిపారు. రైతు ఇబ్బంది పడకూడదనే పంటలకు సమయానికి సాగు నీరు అందిస్తున్నామన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణా జలాలతో అనుసంధానం చేశామని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఆ రోజు చెబితే ప్రజలు అండగా నిలిచారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతోందని, ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.






