ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా నిధుల విడుదలకు ఆమోదం

by Vemula.Srinu Prasad |

ఏపీకి కేంద్రం భారీగా నిధులు విడుదల చేయనుంది. ప్రకృతి వైపరీత్యాల సహకారాన్ని అందించనుంది. ఈ మేరకు రూ. 341.28 కోట్లు విడుదల చేయనుంది...

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా నిధుల విడుదలకు ఆమోదం
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు కేంద్రం(Union Government ) గుడ్ న్యూస్ తెలిపింది. భారీగా నిధులు విడుదల చేయనుంది. ప్రకృతి వైపరీత్యాల సహకారాన్ని అందించనుంది. ఈ మేరకు రూ. 341.28 కోట్లు విడుదల చేయనుంది. మొంథా తుపాను(Storm)తో రాష్ట్రంలో ఆకస్మిక వరదలు(Floods) వచ్చి తీవ్ర నష్టం జరిగిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా ఏపీకి అదనపు సాయంగా రూ. 341. 48 కోట్లు విడుదల చేయనున్నారు. ఇక ఏపీ సహా మొత్తం ఆరు రాష్ట్రాలకు గాను రూ. 1929.99 కోట్ల సాయాన్ని కేంద్రం ఆమోదించింది.

Next Story