- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ బస్సులో పర్స్ కోసం చెకింగ్... వ్యక్తి వద్ద రూ. 44 లక్షల గుర్తింపు
ఆర్టీసీ బస్సులో పర్స్ పోయిందని ఓ ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు...

దిశ, వెబ్ డెస్క్: ఆర్టీసీ బస్సు(RTC Bus)లో పర్స్ పోయిందని ఓ ప్రయాణికులు(Passengers) ఫిర్యాదు చేయడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే పర్సు దొరకలేదు కానీ రూ. 44 లక్షల25 వేల నగదు దొరికింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈ డబ్బును విజయవాడ కృష్ణలంక (Vijayawada Krishna Lanka) పీఎస్కు తరలించారు.
కృష్ణలంక పరిధిలో బస్సులో ఓ ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అయితే సడెన్గా తన పర్స్ పోయిందని, అందులో బంగారం(Gold), డబ్బు(Money) ఉన్నట్లు ఆరోపించారు. అంతేకాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బస్సును కృష్ణలంక పీఎస్ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం బస్సులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద రూ. 44.25 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగదు ఎక్కడిది, ఎవరికి తరలిస్తున్నారు?.. అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రోజు జరిగిన నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. చూడాలి పోలీసుల దర్యాప్తులో ఏం తేలుతుందో.






