- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడ్ న్యూస్.. రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై బ్రేక్.. ప్రత్యేక కమిటీ ఏర్పాటు: మంత్రి
ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రొయ్యల ఫీడ్ ధరలను ప్రభుత్వ అనుమతి లేకుండా పెంచేందుకు వీల్లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రొయ్యల ఫీడ్ ధరలను ప్రభుత్వ అనుమతి లేకుండా పెంచేందుకు వీల్లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) స్పష్టం చేశారు. రొయ్యల రైతులు, ఫీడ్ తయారీదారులతో సుదీర్ఘ సమావేశం అనంతరం ఫీడ్ ధరల నియంత్రణ కోసం ప్రత్యేక రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇకపై కమిటీ సిఫార్సుల మేరకే ఫీడ్ ధరలు నిర్ణయించబడతాయని చెప్పారు. సోయాబీన్, ఫిష్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ ఆ భారం రైతులపై మోపేందుకు ప్రభుత్వం అనుమతించదని మంత్రి పేర్కొన్నారు. రొయ్యల రైతుల ప్రయోజనాల పరిరక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
జోన్, నాన్-జోన్, 10 ఎకరాల పరిమితి నిబంధనలను తొలగించామని, ప్రతి ఆక్వా రైతుకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందిస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతిపక్ష నేత (Y. S. Jagan Mohan Reddy) జగన్‌పై విమర్శలు గుప్పిస్తూ, ప్రతి చిన్న అంశాన్ని రాజకీయంగా మలచడం ఆయన నైజమని అన్నారు. వైసీపీ హయాంలో రూ.750 కోట్ల విద్యుత్ సబ్సిడీ ఇవ్వగా, కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.1,170 కోట్ల సబ్సిడీ అందిస్తోందని పేర్కొన్నారు.






