గ్రామాల్లో ఓట్ల చోరీ కాకుండా అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

by Kodari Anjali |

ప్రతి గ్రామంలో ఒక్క ఓటు కూడా ఎవరూ నష్టపోకుండా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే తెలిపారు.

గ్రామాల్లో ఓట్ల చోరీ కాకుండా అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: ప్రతి గ్రామంలో ఒక్క ఓటు కూడా ఎవరూ నష్టపోకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బూత్ లెవెల్ ఏజెంట్ల(బిఎల్ఎ)కు లకు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సుదర్శన్ కన్వెన్షన్ హాల్‌‌లో టిపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై బిఎల్ఎ లకు అవగాహన శిక్షణ శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో దేశంలోని కొన్ని రాష్ట్రాలలో లక్షలాది ఓట్లను తొలగించిన ఉదాహరణలు ఉన్నాయని, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలను ఉదాహరణగా చూపుతూ, ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చే చర్యలను ఆయన ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి కుట్రలు జరిగే అవకాశముందని, కేంద్రంలోని బిజేపి ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

నెలరోజులపాటు గ్రామాలలోనే ఉండి..

మన రాష్ట్రంలో ఒక్క ఓటరు కూడా తన ఓటును కోల్పోకుండా కాపాడటం ప్రతి బిఎల్ఎ బాధ్యత అని స్పష్టం చేశారు. బిఎల్ఓ లతో సమన్వయం చేసుకుంటూ, వారు అందించే ఫారాలను ప్రజలచేత సరిగ్గా పూరించి అధికారులకు సమర్పించాల్సిన బాధ్యత బిఎల్ఎ లపైన ఉందన్నారు. అంతకుముందు బిఎల్ఎ శిక్షణ కమిటీ చైర్మెన్, పరిగి ఎమ్మెల్యే టి.రాంమోహన్ రెడ్డి బిఎల్ఎలకు శిక్షణ తరగతులు నిర్వహించి మాట్లాడారు. బిఎల్ఓలు గ్రామాలకు వచ్చినప్పుడు ఇతర పనులను పక్కన పెట్టి వారితో కలిసి 'సర్' కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. నెలరోజులపాటు గ్రామాలలోనే ఉండి ఓటర్ల వివరాలను సమగ్రంగా సేకరించాలని, ఎలాంటి అలసత్వం వహించినా పార్టీకి, ప్రజలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, నగర మేయర్ మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, టిపిసిసి ప్రత్యేక ట్రేనర్ వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత, వినోద్ కుమార్, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story