మధుర గీతాలకు శ్రద్ధ, ప్రేమ అవసరం.. వాయిదాపై ‘మకుటం’ టీమ్ పోస్ట్

by Chukka Sudharani |

కోలీవుడ్ హీరో విశాల్ స్వీయ డైరెక్షన్‌లో రాబోతున్న చిత్రం ‘మగుడం’.

మధుర గీతాలకు శ్రద్ధ, ప్రేమ అవసరం.. వాయిదాపై ‘మకుటం’ టీమ్ పోస్ట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో విశాల్ స్వీయ డైరెక్షన్‌లో రాబోతున్న చిత్రం ‘మగుడం’. తెలుగులో ఈ మూవీ ‘మకుటం’ పేరుతో రిలీజ్ కాబోతున్నది. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన పలు అప్డేట్స్‌తో సినిమాపై మంచి అభిప్రాయం ఏర్పడగా.. ఇటీవల టీజర్‌ను విడుదల చేసి సినిమాపై హైప్‌ను పెంచేశారు చిత్ర బృందం. ఇప్పుడు అదే జోష్‌తో తాజాగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈరోజు (జూన్ 16) విడుదల చేయబోతున్నట్లు ఓ స్పెషల్ వీడియో సైతం రిలీజ్ చెయ్యగా.. తాజాగా ఫస్ట్ సింగిల్ వాయిదా పడినట్లు మరో నోట్ షేర్ చశారు. ఈ మేరకు ‘ప్రియమైన మిత్రులారా.. 'మగుడం/ మకుటం' చిత్రం నుండి మొదటి పాటను ఈరోజే విడుదల చేయాలని అనుకున్నాము. అయితే, కొన్నిసార్లు ఒక పాట ప్రపంచం ముందుకు వచ్చే ముందు దానికి మరికొంత శ్రద్ధ, ప్రేమ అవసరమవుతాయి.. అందుకే మా ఈ మొదటి పాట విడుదల వాయిదా వేయబడింది. ఇది ఇప్పుడు జూన్ 19న విడుదల కానుంది’ అంటూ తెలిపారు. కాగా.. ఆర్ బి చౌదరి సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రంలో దుషారా విజయన్, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

Next Story