గురుకులాల టెండర్లలో రూ.2వేల కోట్ల కుంభకోణం..? స్పందించిన బీసీ సంక్షేమ శాఖ

by Ramesh Naini |

గురుకుల విద్యాలయాల టెండర్లలో రూ.2 వేల కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయా దేవి స్పష్టం చేశారు.

గురుకులాల టెండర్లలో రూ.2వేల కోట్ల కుంభకోణం..? స్పందించిన బీసీ సంక్షేమ శాఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో : గురుకుల విద్యాలయాల టెండర్లలో రూ.2 వేల కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయా దేవి స్పష్టం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో 'ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్' ద్వారా విద్యార్థుల కొలతలు సేకరించి అత్యంత పారదర్శకంగా టెండర్లు నిర్వహించినట్లు తెలిపారు. దేశంలోని ప్రఖ్యాత కంపెనీలు పోటీపడి సరసమైన ధరలకే నేరుగా హాస్టళ్లకు నాణ్యమైన వస్తువులను సరఫరా చేస్తున్నాయని పేర్కొన్నారు.

గతంలో నిర్లక్ష్యం చేసిన స్కూల్ బ్యాగ్, రెండు జతల షూస్, టవల్స్, స్టేషనరీ కిట్లను ఇప్పుడు 28 లక్షల మంది విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. వీరికి అవసరమైన 56 లక్షల జతల యూనిఫాంలు 20 వేల మంది మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా కుట్టిస్తూ వారికి ఉపాధి కల్పిస్తున్నట్లు వివరించారు. గతంలో వస్తువులు సకాలంలో అందక విద్యార్థులు ఇబ్బంది పడ్డారని, కానీ ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అన్ని వస్తువులను సకాలంలో అందిస్తున్నామని కమిషనర్ స్పష్టం చేశారు.

Next Story