ఎయిరిండియా కీలక నిర్ణయం.. ఇక తక్కువ ధరకే విమాన ప్రయాణం

by Kema Shiva Kumar |

విమాన ప్రయాణికులకు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా అదిరిపోయే తీపికబురు చెప్పింది.

ఎయిరిండియా కీలక నిర్ణయం.. ఇక తక్కువ ధరకే విమాన ప్రయాణం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని విమాన ప్రయాణికులకు ఎయిరిండియా (Air India) సంస్థ తీపి కబురు అందించింది. విమాన ప్రయాణంలో భోజనం (Meals) అవసరం లేదనుకునే వారి కోసం తక్కువ ధరకే టికెట్లను ఆఫర్ చేస్తూ సరికొత్త ‘బేసిక్’ (Basic) ఫేర్ కేటగిరీని ప్రవేశపెట్టింది. దీంతో ప్రయాణికులు సాధారణ ఎకానమీ క్లాస్ టికెట్ ధర కంటే తక్కువ ఖర్చుతోనే తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. తాజాగా ఎకానమీ క్లాస్‌లో ఇప్పటికే ఉన్న వాల్యూ, క్లాసిక్, ఫ్లెక్స్ కేటగిరీలతో పాటు కొత్తగా నాలుగో కేటగిరిగా ‘బేసిక్’ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. అయితే, ప్రస్తుతానికి ఈ సదుపాయాన్ని దేశీయంగా తక్కువ సమయం ప్రయాణించే (Short-haul) కొన్ని ఎంపిక చేసిన రూట్లలో మాత్రమే పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. ఢిల్లీ-చండీగఢ్, ఢిల్లీ-ఉదయ్‌పూర్ సహా సుమారు 15 నుంచి 20 రూట్లలో ఈ సేవలు అందుబాటులో ఉండునున్నాయి. ‘బేసిక్’ టికెట్ తీసుకున్న వారికి కూడా ఎప్పటిలాగే 15 కేజీల చెక్-ఇన్ లగేజ్, 7 కేజీల క్యాబిన్ లగేజ్ పర్మీషన్ ఉంటుంది. విమాన ప్రయాణంలో ప్యాసింజర్లకు ఫ్రీగా టీ, కాఫీ ఇస్తారు.

Next Story