- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాబర్ ఆజంకు మరో ఎదురు దెబ్బ
పాకిస్థాన్ T20I జట్టు నుంచి బాబర్ ఆజంను శాశ్వతంగా తొలగించే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంకు ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ టీ20 జట్టు నుంచి శాశ్వతంగా బాబర్ ఆజంను తొలగించే దిశగా PCB నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఒకప్పుడు పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన బాబర్, ఆ తర్వాత అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. దీంతో కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానం కూడా కోల్పోయాడు. ఇక ఇప్పుడిప్పుడే మళ్ళీ ఎదుగుతున్న బాబర్, టీ20లలో మాత్రం అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు.
మొన్న PSLలో తన జట్టును ఛాంపియన్ గా నిలిపినప్పటికీ కూడా అతనికి జాతీయ జట్టులో అవకాశం రావడం లేదు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా బాబర్ రికార్డ్ సృష్టించాడు. 4,596 పరుగులు చేసి, టాప్ లో ఉన్నాడు. అలాంటి బాబర్ నే టీ20 జట్టు నుంచి శాశ్వతంగా తప్పించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ లో అతనికి అవకాశం ఇవ్వలేదట. భవిష్యత్తులో కూడా టీ20లో బాబర్ కు అవకాశం ఇవ్వడం కష్టమేనని అంటున్నారు. వన్డేలు, టెస్టులకు మాత్రమే అతన్ని పరిమితం చేస్తారని సమాచారం.






