- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోకేశ్వరం మండలంలో దొంగల అలజడి
by Batti.Sumithra |
సోమవారం రాత్రి లోకేశ్వరం మండలంలో దొంగలు అలజడి సృష్టించారు.

X
దిశ, లోకేశ్వరం : సోమవారం రాత్రి లోకేశ్వరం మండలంలో దొంగలు అలజడి సృష్టించారు. రాయపూర్ కాండ్లి గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు దేవమ్మ ఆలయంలో చోరీకి పాల్పడి 500 గ్రాముల వెండితో పాటు 10 గ్రాముల బంగారం దోచుకెళ్లారు. అలాగే అదే గ్రామంలోని కోనేరు నారాయణ అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తున్న ఆమె సోదరి మెడలో నుంచి 20 గ్రాముల బంగారం గొలుసు అపహరించుకొని వెళ్లినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. ఆలయ చైర్మన్ కోనేరు సాయన్న, కోనేరు గంగాధర్ ల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి క్లూస్ టీంకు సమాచారం ఇవ్వడంతో వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
Next Story






