- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇచ్చిన హామీ మేరకు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పూర్తి చేయండి : కవిత
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కారణంగా చూపుతూ లేనిపోని పంచాయతీలు చెప్పి ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయొద్దని తెలంగాణ రక్షణ సేవ అధ్యక్షురాలు కవిత అన్నారు.

దిశ, ఆసిఫాబాద్ : తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కారణంగా చూపుతూ లేనిపోని పంచాయతీలు చెప్పి ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయొద్దని తెలంగాణ రక్షణ సేవ అధ్యక్షురాలు కవిత అన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని పార్టీ నాయకులతో కలిసి ఆమె సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఐదుగురు ముఖ్యమంత్రులు మారినా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2006లోనే ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు పూర్తి కాలేదని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే లక్ష ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉండగా, ప్రస్తుతం కేవలం ఆరు వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోందని చెప్పారు. గత 26 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు కరువు పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుంటిసాకులు మానుకుని వెంటనే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించి, పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు.






