- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కిరాణా షాపులో పాడైన గుడ్ల విక్రయాలు..
by Kodari Anjali |
ఓ కిరాణా షాపులో కొనుగోలు చేసిన కోడిగుడ్డులో కుళ్లిపోయిన కోడిపిల్ల పిండం బయటపడటంతో వినియోగదారుడు షాక్ అయ్యాడు.

X
దిశ, నవాబుపేట: మండల పరిధిలోని అమ్మాపూర్ గ్రామంలోని ఓ కిరాణా షాపులో మంగళవారం రాత్రి కొనుగోలు చేసిన కోడిగుడ్డులో కుళ్లిపోయిన కోడిపిల్ల పిండం బయటపడటంతో వినియోగదారుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. కూర చేయడం కోసం గుడ్డును పగులగొట్టిన వినియోగదారుడు అందులో చనిపోయిన కోడిపిల్ల పిండం కనిపించడంతో వినియోగదదారుడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. కిరాణా షాపుల్లో పాత, పాడైన గుడ్లను నిల్వ చేసి విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామ ప్రజలలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆహార భద్రతా అధికారులు వెంటనే కిరాణా దుకాణాలపై తనిఖీలు చేపట్టి, నాణ్యత లేని వస్తువులు అమ్ముతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Next Story






