- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో విశాఖ టెకీ అనుమానాస్పద మృతి!
ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గాయత్రి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గాయత్రి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు. భర్త శ్రీచరణ్‌తో కలిసి పర్యటనకు వెళ్లిన ఆమె ఓ హోటల్ గదిలో మృతదేహంగా కనిపించారు. ముక్కు నుంచి రక్తస్రావం జరిగినట్లు గుర్తించిన పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విశాఖలోని చినముషిడివాడకు చెందిన గాయత్రి, శ్రీచరణ్‌లకు గత ఏడాది నవంబర్ 8న వివాహం జరిగింది. ప్రస్తుతం ఇద్దరూ గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నట్లు సమాచారం. గాయత్రి మృతి విషయం తెలిసిన వెంటనే ఆమె కుటుంబ సభ్యులు ముస్సోరికి బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది. పెళ్లైన ఏడాది తిరగక ముందే గాయత్రి మరణించడంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Next Story






