- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ పరీక్షకు పకడ్బందిగా ఏర్పాట్లు: విజయేందర్ రెడ్డి
నీట్ పరీక్షను పకడ్బందిగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు.

దిశ, మేడ్చల్ బ్యూరో: నీట్ పరీక్షను పకడ్బందిగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు. ఈ నెల 21 న జరుగనున్న నీట్ పరీక్ష (నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్) మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పరీక్షకు జిల్లా నుండి 3 వేల 311 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు. అభ్యర్థులు నిర్ణీత సమయంలోగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అదనపు కలెక్టరు సూచించారు.
అధికారులు బందోబస్తు ఏర్పాటు చేయాలి..
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్లో ఉన్న నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభర్థులకు కరెంట్, మంచినీరు అందుబాటులో ఉంచాలని, కేంద్రాల వద్ద పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. వైద్య అధికారులు మెడికల్ కిట్, అంబులెన్సలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. నిరంతరాయ విద్యుత్తు సరఫరా ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దివ్యాంగులకు అవసరమైన వీల్ చైర్ వంటి వాటిని అందుబాటులో ఉండేలా డిడబ్ల్యూఓ అధికారిని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డిఓలు వెంకట్ రెడ్డ, శ్యాంప్రకాష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






