- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం: మంత్రి లక్ష్మణ్ కుమార్
విద్యుత్ ప్రమాదంతో మరణించిన కట్ట అశోక్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

దిశ, ధర్మారం: ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో సోమవారం జరిగిన విద్యుత్ ప్రమాదంతో మరణించిన కట్ట అశోక్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. నంది మేడారం గ్రామంలో విద్యుత్ మరమ్మత్తులు చేస్తుండగా కట్ట అశోక్ అని ప్రైవేట్ ఎలక్ట్రిషన్ విద్యుత్ షాక్ తో తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుండి హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటాం..
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. అశోక్ మృతి చెందారు.ప్రైవేట్ ఎలక్ట్రిషన్ అశోక్ మృతి విషయం తెలుసుకున్న రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం గాంధీ ఆసుపత్రిలో మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. మృతదేహానికి నివాళులు అర్పించారు. రూ. 20వేల ఆర్థిక సహాయాన్ని మంత్రి అడ్లూరి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని అన్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంగా ఉండాలని మంత్రి అన్నారు. ప్రమాదంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. మంత్రి వెంట నంది మేడారం గ్రామ సర్పంచ్ వీర్ పాల్ తోపాటు ధర్మారం మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.






