కిషన్‌రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?.. సీఎం రేవంత్‌పై రాకేష్‌రెడ్డి ఫైర్

by Ramesh Naini |

గ్రేటర్ ​ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ఎమ్మెల్యే రాకేష్​రెడ్డి ఆరోపించారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో అపాయింట్‌మెంట్ తెచ్చుకోలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కిషన్ రెడ్డి ఎందుకు నిందిస్తున్నారని ప్రశ్నించారు.

కిషన్‌రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?.. సీఎం రేవంత్‌పై రాకేష్‌రెడ్డి ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ ​ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ఎమ్మెల్యే రాకేష్​రెడ్డి ఆరోపించారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో అపాయింట్‌మెంట్ తెచ్చుకోలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కిషన్ రెడ్డి ఎందుకు నిందిస్తున్నారని ప్రశ్నించారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నిర్ణయాలకు కిషన్ రెడ్డికి ఏం సంబంధమని, ప్రతి విషయాన్ని రాజకీయంగా చూడటం మానుకోవాలని హెచ్చరించారు. హైదరాబాద్ మెట్రోను నిలబెట్టి మొదటి దశకు నిధులు ఇచ్చింది మోడీ ప్రభుత్వమేనని, మొదటి దశలోనే కేంద్రం రూ.1,200 కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు.

అవినీతి ప్రాజెక్టులకు అనుమతులు రాకపోతే, మీ డీపీఆర్‌లు ఆమోదం పొందకపోతే కిషన్ రెడ్డిని బాధ్యుడిని చేయడం సిగ్గుచేటన్నారు. అలాంటి నాయకుడిపై అవాకులు, చెవాకులు మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయికి తగదు.. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాలు అంటూ దశాబ్దాలుగా మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని విరుచుక పడ్డారు. రీజినల్ రింగ్ రోడ్‌కు కేంద్రం ఆమోదాలు, నిధులు ఇచ్చింది. మరి సౌత్ అలైన్‌మెంట్‌ను ఎందుకు మార్చాలని చూస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేక, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.1,000 కోట్లున్న రైల్వే బడ్జెట్‌ను రూ.5,500 కోట్లకు పెంచింది కేంద్ర ప్రభుత్వమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, రుణమాఫీ, సన్నబియ్యం బోనస్-ఏ హామీని పూర్తిగా అమలు చేయలేదు. ఇప్పటికైన ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు.

Next Story