- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించండి
by Taduka Kalyani |
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలను ప్రశాంతంగా.. నిర్వహించాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అధికారులకు ఆదేశించారు.

X
దిశ, బేగంపేట : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలను ప్రశాంతంగా.. నిర్వహించాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఈవో గుత్తా మనోహర్రెడ్డితో పాటు అర్చకులు.. తదితరులతో మంత్రులను కలిసి కలిసి జాతర నిర్వహించే తేదీల గురించి వివరించారు. జూలై 19వ తేదీన ఘటాల ఊరేగింపు, ఆగస్టు 2వ తేదీన అమ్మవారి బోనాలు. 3వ తేదీన రంగం కార్యక్రమం ఉంటుందని మంత్రికి తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ సారి భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని ఏర్పాట్ల విషయంలో ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. బోనాల జాతరలో ఏర్పాట్ల విషయంలో ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని వారు సూచించారు.
Next Story






