ఒకే ఫార్ములా వర్కౌట్ అవ్వదు.. షాకింగ్‌గా వడ్డే నవీన్ కామెంట్స్

by Chukka Sudharani |

ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ నటుడు వడ్డే నవీన్.. త్వరలో ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఒకే ఫార్ములా వర్కౌట్ అవ్వదు.. షాకింగ్‌గా వడ్డే నవీన్ కామెంట్స్
X

దిశ, సినిమా: ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ నటుడు వడ్డే నవీన్.. త్వరలో ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఈయన.. ఇండస్ట్రీ మార్పలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘సినిమా రంగం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అలాగే ప్రతి సినిమా తనదైన సమయంలో తనదైన ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఒక సినిమా భారీ విజయాన్ని సాధించింది కదా అని అందరూ అదే తరహాలో సినిమాలు తీయాలనుకుంటే అది వర్కౌట్ అవ్వదు. ఒకప్పుడు శివ సినిమా రిలీజైన తర్వాత తెలుగు సినిమా శివ ముందు, శివ తర్వాత అనే చర్చ జరిగింది. ఆ సినిమా కొత్త దారిని చూపించినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ ప్రేక్షకులు ఘరానా మొగుడు, అల్లరి ప్రియుడు వంటి కమర్షియల్ సినిమాల‌ను కూడా ఎంజాయ్ చేశారు, ఆదరించారు. అంటే ప్రేక్షకుల అభిరుచి ఒకే రకంగా ఉండదు. కాలానికి అనుగుణంగా మారుతుంది. అదే విధంగా ఇటీవల అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సినిమాలు పెద్ద డిస్కష‌న్‌కు కారణమయ్యాయి. అయితే.. అలాంటి సినిమాలు సహజంగా పుడతాయి. వాటిని కూర్చొని ప్లాన్ చేసి తయారు చేయలేము. ఒక ప్రత్యేక కథ, ప్రత్యేక పాత్ర, సరైన సమయం, డైరెక్టర్ విజన్, ప్రేక్షకుల మూడ్ అన్నీ కలిసి వచ్చినప్పుడు మాత్రమే అలాంటి సినిమాలు రూపొందుతాయి’ అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

Next Story