- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోచ్ అవతారంలో మహేష్ బాబు..వారణాసి తర్వాత భారీ ప్లాన్ ?
వారణాసి తర్వాత కోచ్ పాత్రలో మహేష్ బాబు, ఓ సినిమా చేయనున్నారట.

దిశ, వెబ్ డెస్క్: ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈ సినిమా, టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతోందట. ఈ మూవీలో మహేష్ బాబు హీరోగా చేస్తుండగా, ప్రియాంక చోప్రా హీరోయిన్ గా మెరువనున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నారు. 2027 సమ్మర్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జక్కన్నతో బిజీగా ఉన్న మహేష్ బాబుతో సినిమా చేసేందుకు ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకులు లైన్ కడుతున్నారు. ఇప్పటికే మహేష్ తో సినిమా చేస్తానని బుచ్చిబాబు కంకణం కట్టుకొని కూర్చుంటే.. స్పిరిట్ పూర్తికాగానే తానే సినిమా చేస్తానని సందీప్ రెడ్డి అంటున్నారట.
ఈ క్రమంలో మొదట సందీప్ రెడ్డి సినిమా, ఆ తర్వాత బుచ్చిబాబుతో మహేష్ మూవీ చేస్తాడని సోషల్ మీడియాలో నిన్నటి వరకు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు వారణాసి మూవీ తర్వాత మహేష్ బాబు చేసే కొత్త సినిమాపై మరో అప్డేట్ వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయనున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఈ మూవీస్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తుందని ప్రచారంలో ఉంది. ఇందులో మహేష్ బాబు కోచ్ కనిపిస్తారని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా రాలేదు. ఇది కూడా ప్రచారం మాత్రమే. మరి వారణాసి సినిమా తర్వాత మహేష్ బాబు ఎవరితో చేస్తారో చూడాలి.






