సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణానికి స్థల పరిశీలన..

by Kodari Anjali |

మూసిఉన్న బిసి ప్రీమెట్రిక్ హాస్టల్స్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు.

సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణానికి స్థల పరిశీలన..
X

దిశ, మేడ్చల్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అల్పాహారం కార్యక్రమానికి జిల్లాలో 22 పాఠశాలల ఎంపికైన సందర్భంగా కేంద్రీకృత వంటగది నిర్మాణానికి గాను స్థల సేకరణ నిమిత్తం ఆలియాబాదు, కేశవరంలోని మూసిఉన్న బిసి ప్రీమెట్రిక్ హాస్టల్స్ ను మంగళవారం జిల్లా కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా అంతటా అల్పాహారాన్ని అందించే విధంగా ఉండేందుకు సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణానికి గాను స్థల పరిశీలనకై శామీర్ పేట్, మూడుచింతలపల్లి మండలాలలోని హాస్టల్స్ ను తనిఖీ చేస్తున్నామన్నారు. ఈ హాస్టల్స్ ఎప్పటి నుండి మూసి ఉన్నాయని, ఎంత స్థలం ఉందని బిసి వెల్పేర్ అధికారిని అడిగి తెలుసుకున్నారు.

ఎంత మంది హాజరయ్యారు...?

ఈ రెండు హాస్టల్స్ స్థల వివరాల నివేదికను తనకు అందజేయాలని సంబంధిత ఎంఆర్ఓలకు సూచించారు. అనంతరం కేశవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులు ఎంత మంది హాజరైనారని సంబంధితగ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఎన్నికొత్త అడ్మిషన్లు అయ్యాయని అడిగారు. పిల్లలతో ముచ్చటిస్తూ భోజనం ఎలా ఉంది, ఆడుకోవడానికి పరికరాలు ఉన్నాయా, ఏమైనా కావాలా అని విద్యార్థులను అడుగగా, ఫుట్ బాల్, క్రికెట్ కిట్లు కావాలని విద్యార్థులు కోరగా, కలెక్టర్ అందిస్తామన్నారు. ఈ పర్యటనలో జిల్లా బిసి వెల్పేర్ ఆఫీసర్ ఝాన్సీరాణి, శామీర్ పేట్ ఎంఆర్ఓ శ్రీనివాస్, మూడుచింతలపల్లి ఎంఆర్ఓ మహమ్మద్ ఇద్రీస్, టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అల్పాహార నిర్వహణ కాంట్రాక్టు ఎజెన్సీ మన్న ట్రస్ట్ వారితో కలెక్టర్ మాట్లాడుతూ, వివరాలు అడిగి తెలుసుకొని అవసరమైన సలహాలు సూచనలు అందజేశారు.

Next Story