సర్కార్‌ దవాఖానలో మందులు నేలపాలు..

by Kodari Anjali |

సర్కార్ దావఖానలో వైద్య అధికారి పర్యవేక్షణ లేకపోవడంతో, ఫార్మసిస్టు నిర్లక్ష్యం వల్ల విలువైన టాబ్లెట్స్ నేలపాలు అయ్యాయి.

సర్కార్‌ దవాఖానలో మందులు నేలపాలు..
X

దిశ, మిడ్జిల్: సర్కార్ దావఖానలో వైద్య అధికారి పర్యవేక్షణ లేకపోవడంతో, ఫార్మసిస్టు నిర్లక్ష్యం వల్ల విలువైన టాబ్లెట్స్ నేలపాలు అయ్యాయి. మిడ్జిల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన ప్రజలకు సరియైన మందులు ఇవ్వకుండా మందులు కొరత ఉందని తెలిపేవారు. అలా ఫార్మసిస్ట్ నిర్లక్ష్యం కారణంగా రోగులకు సరైన విధంగా మందులు పంపిణీ చేయకపోవడంతో కుప్పలు కుప్పలుగా విలువైన టాబ్లెట్లు చివరి డేట్‌కు వచ్చాయి. కొన్ని మందులు ఇంకా ఎక్స్పైర్ డేట్ ఉన్న, అవి ఇవి అన్ని టాబ్లెట్స్ కలిపి ఆసుపత్రి వెనుక భాగంలో పెద్ద గుంతలో పారబోశారు. వైద్యాధికారి నిర్లక్ష్యంతో పేదరోగుల ఆరోగ్యం గాల్లో దీపంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాస్థాయి అధికారులు విచారణ చేపట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story