తొర్రూరు పీఏసీఎస్ అభివృద్ధి పై కర్నూలు బృందం అధ్యయనం

by Batti.Sumithra |

తెలంగాణ రాష్ట్రంలో స్వల్ప కాలంలోనే విశేష అభివృద్ధి సాధించి ఆదర్శ సహకార సంఘంగా గుర్తింపు పొందిన తొర్రూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా సహకార రంగ ప్రతినిధుల బృందం మంగళవారం సందర్శించింది.

తొర్రూరు పీఏసీఎస్ అభివృద్ధి పై కర్నూలు బృందం అధ్యయనం
X

దిశ, తొర్రూరు : తెలంగాణ రాష్ట్రంలో స్వల్ప కాలంలోనే విశేష అభివృద్ధి సాధించి ఆదర్శ సహకార సంఘంగా గుర్తింపు పొందిన తొర్రూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా సహకార రంగ ప్రతినిధుల బృందం మంగళవారం సందర్శించింది. ఈ సందర్భంగా సంఘం చైర్మన్ కాకిరాల హరిప్రసాద్‌రావు అధ్యక్షతన తొర్రూరు పీఏసీఎస్ అభివృద్ధి, అమలు చేస్తున్న కార్యక్రమాలు, సభ్యులకు అందిస్తున్న సేవలు, ఆర్థిక ప్రగతి తదితర అంశాల పై ప్రత్యేక ప్రజెంటేషన్ నిర్వహించారు. సంఘం సాధించిన పురోగతి, రైతులకు అందిస్తున్న సేవల గురించి బృందానికి వివరించారు.

స్టడీ టూర్‌లో భాగంగా వచ్చిన కర్నూలు జిల్లా డీసీసీ బ్యాంకు సీఈవో రామాంజనేయులు, డీజీఎం ఉమామహేశ్వర్‌రెడ్డి, డీపీఎం రంగనాథ్‌తో పాటు వివిధ పీఏసీఎస్‌ల చైర్మన్లు, సీఈవోలు, బ్యాంకు శాఖల మేనేజర్లు పాల్గొన్నారు. తెలంగాణలో సహకార రంగంలో తొర్రూరు పీఏసీఎస్ సాధించిన అభివృద్ధి, నిర్వహణ విధానాలు, సభ్యులకు అందిస్తున్న సేవల పై వారు ఆసక్తిగా తెలుసుకున్నారు. సంఘం అభివృద్ధికి దోహదపడిన పాలకవర్గం కృషిని ప్రశంసించిన కర్నూలు జిల్లా ప్రతినిధులు, చైర్మన్ కాకిరాల హరిప్రసాద్‌రావును ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఇతర సహకార సంఘాలకు కూడా తొర్రూరు పీఏసీఎస్ ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సీఈవో శ్రీనివాస్‌తో పాటు సంతోష్, యాకయ్య, నవీన్, ఉపేందర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. తొర్రూరు పీఏసీఎస్ అభివృద్ధి నమూనాను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా తమ జిల్లాలోనూ ఇలాంటి కార్యక్రమాలను అమలు చేసేందుకు ఉపయోగపడుతుందని కర్నూలు బృందం సభ్యులు అభిప్రాయపడ్డారు.

Next Story